బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారంతో ముంగింపు పలకనుంది.. గత వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తి జనాల్లో మొదలవుతుంది.. అందరు ఎవరికి వారే విన్నర్ అని తెగ సంతోష పడిపోతున్నారు.. టైటిల్ కూడా బాగానే ఉంటున్నారు.. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. టాప్ 6 గా నిలిచిన అమర్ దీప్, అర్జున్, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ లను సర్‌ప్రైజ్ చేశాడు బిగ్ బాస్…
హౌస్ లో ఉన్న ఒక్కొక్కరిని లాన్ లోకి పిలిచాడు.. బిగ్ బాస్ లో వారి జర్నీ గురించి ఫోటోలను చూపిస్తూ వీడియోలతో ఎమోషనల్ అయ్యేలా చేశారు.. అయితే అమర్, అర్జున్ కు సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే రిలీజ్ చేశాడు బిగ్ బాస్. తాజాగా శివాజీ ప్రోమోను రిలీజ్ చేశారు. శివాజీ తన జర్నీని చూసుకొని ఎమోషనల్ అయ్యాడు..ఈ పూర్తి సీజన్ లో మీ మీద పై చేయి సాధించిన విషయం ఎదో తెలుసా..? అది కాఫీ పై మీ ఇష్టం అని చెప్పాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫర్మ్ హౌస్ మేట్స్ గా నిలిచారు. మీ ఆట తీరే మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థానంలో నిలిపింది.. ఇది మర్చిపోలేని జర్నీ అని బిగ్ బాస్ కు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఆ వీడియో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..
ఇక ఈ వారం నామీనేషన్స్ కూడా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది.. వీరి ఆరుగురిలో అర్జున్ ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నాడు.. ఇక అమర్, యావర్, ప్రియాంక లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే టాక్ వినిపిస్తుంది.. అలాగే రైతుబిడ్డ కామన్ మ్యాన్ ప్రశాంత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. అర్జున్ రన్నర్ గా నిలుస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. జనాల ఓటింగ్ ను బిగ్ బాస్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.. ఈరోజు ఎపిసోడ్ చాలా సందడిగా ఉంటుంది.. అసలు మిస్ అవ్వకండి…