NTV Telugu Site icon

Bigg Boss 6: శ్రీసత్యకు బిగ్‌బాస్ క్లాస్.. ఆ విషయంలో రేవంత్-ఫైమా మధ్య మాటల యుద్ధం

Sri Satya

Sri Satya

Bigg Boss 6: బిగ్‌‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్‌గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్‌లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్‌ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్‌ల నుంచి సేవ్ అవుతూనే వస్తున్నాడని శ్రీసత్య చెప్పగా బిగ్‌బాస్ క్లాస్ పీకాడు. నామినేషన్‌కు కరెక్ట్ రీజన్ చెప్పాలని హితవు పలికాడు. దీంతో శ్రీసత్య ఏం చెప్పిందో సోమవారం ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అటు హౌస్‌లో ఫుడ్ విషయంలో ఫైమా, రేవంత్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. రేవంత్ కెప్టెన్ కావడంతో అందరికీ సరిపడా రైస్ పెట్టడం లేదని ఫైమా ఆరోపిస్తుంది.

తన కెప్టెన్సీలో ఐదు కప్పుల రైస్ పెట్టుకునేవాళ్లమని.. అయితే రేవంత్ హయాంలో మాత్రం కడుపు నిండా అన్నం పెట్టడం లేదని ఫైమా ఆరోపిస్తుంది. అయితే ఇచ్చిన రేషన్ ప్రకారమే రైస్ పెడుతున్నామని రేవంత్ వాదిస్తాడు. ఇచ్చిన రైస్ వరకే వండుకోవాలని లేదని.. రైస్ అయిపోతే బిగ్‌బాస్ మళ్లీ పంపిస్తాడని ఫైమా చెప్తుంది. అయితే వాళ్లు ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు రైస్ వండుకోవడం తనకు ఇష్టం లేదని అంటాడు. తర్వాత ఫైమాకు శ్రీహాన్ కూడా తోడుగా నిలుస్తాడు. ఫుడ్ విషయంలో రేవంత్‌ను ప్రశ్నిస్తాడు. వారం మొత్తం జనాలను ఆకలితో పస్తులు ఉంచి చివర్లో మిగిలింది పెడతానంటే ఎవరూ సంతృప్తి వ్యక్తం చేయరని.. అలా అయితే కెప్టెన్‌గా ఎలా సక్సెస్ అవుతావని నిలదీస్తాడు. అటు ఇనయా కూడా ఫుడ్ దగ్గర రిస్ట్రిక్షన్ చేస్తే రేవంత్‌కు ఏం వస్తుందని అసహనం వ్యక్తం చేస్తుంది. అంత అధికారం చెలాయించడం దేనికి అని.. తన మాటే వినాలని.. తాను చెప్పిందే చేయాలని చెప్పడం సబబుు కాదని ఇనయా వాపోతుంది. మరి ఈ గొడవ ఎలా సద్దుమణిగిందో తెలియాలంటే సోమవారం నాటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.