NTV Telugu Site icon

Bigg Boss7 Telugu : ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. పూజా మూర్తి షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 8

Bigg Boss 8

బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి.. నిన్నటివరకు కామ్ గా ఉన్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బూతులు తిడుతున్నారు.. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్‌ పీకాడు.. ఆ సంగతి అప్పుడే మర్చిపోయి అమర్‌దీప్‌, సందీప్‌, గౌతమ్‌.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే అందరిముందు మంచిగా నటించాడు..

ఈ వారం నామినేషన్స్ అయ్యాక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సీరియల్‌ బ్యాచ్‌ మీద విషం కక్కాడు. ‘దొంగలు దొంగ.. దొంగ.. అని పరిగెట్టిస్తున్నారు. జనాలు చూస్తారు. ఇప్పుడన్నా మనుషులు, ప్రజలు అనే వాళ్లుంటే ఈ వారం చూస్తా.. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్‌లో ఉంటా.. తర్వాత ఎవరినో ఒకరిని కొట్టి నేనే స్వచ్ఛందంగా వెళ్లిపోతా. ఇక్కడున్నవాళ్లంతా ఏం చేస్తున్నారు? ఈ హౌస్‌ అంతా డిస్టర్బ్‌ అవుతుంటే ఏంటిదంతా?.. ఈ వారం ఎవరు మంచి వాళ్ళో తెలుస్తుంది.. నామినేషన్స్ బాగా పడ్డాయి ప్రజలు ఎవరిని పంపిస్తారో చూడాలి అంటూ లేటెస్ట్ ఎపిసోడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక శివాజీ ఏం చెప్పినా ప్రిన్స్‌ యావర్‌, ప్రశాంత్‌ వింటారు. తను ఏం మాట్లాడినా గొర్రెల్లా తలూపుతారు. కానీ జనాల్ని కూడా మానిప్యులేట్‌ చేయాలనుకుంటున్నాడు శివాజీ. అదంత ఈజీ కాదు.. జనాలు ఆట తీరును చూసి ఓట్లేస్తారు, కానీ ఒకరు చెప్పగానే చేతులు కట్టుకుని దాన్ని ఫాలో అయిపోరు. పైగా ఒకరిని కొట్టేసి వెళ్లిపోతా అనడం చాలా పెద్ద మాట అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. అలాగే పూజా కూడా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని శివాజీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..