NTV Telugu Site icon

Amardeep -Teju : కొత్త కారును కొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ధర ఎంతో తెలుసా ?

Teju Amar

Teju Amar

బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులారిటీని సొంతం చేసుకుంటారు.. అలాగే సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు . అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది.. ఆ సినిమా సెట్స్ మీద ఉంది . ఇప్పుడు తాజాగా ఓ కారుకు ఓనర్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ సినిమాలో సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ దీప్ చేస్తున్నాడు. సుప్రిత, అమర్ దీప్ జోడికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక అమర్ దీప్ ఎక్కువగా సినిమాల మీదే ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రవితేజ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.. ఆ ఛాన్స్ కోసం అమర్ కూడా వెయిట్ చేస్తున్నాడు..

ఇదిలా ఉండగా .. తాజాగా అమర్ దీప్ , తేజు లు కొత్త కారును కొనుగోలు చేసారు. తేజస్విని ఈ కొత్త కారు ముందు నిల్చుని పోజుల ఇచ్చింది. కొత్త కారు కొనేశామన్న సంతోషం ఆమె మొహంలో ఇట్టే కనిపిస్తోంది. కారు ఓపెనింగ్‌లో అమర్ దీప్, తేజస్విని ఫ్రెండ్స్ గ్యాంగ్ సందడి చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. బ్లాక్ కలర్ టాటా సఫారిని కొనేసినట్టుగా ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. దీని ధర పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంటుందని అంచనా..