NTV Telugu Site icon

Bigg boss 6: ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!

Arjun Kalyan

Arjun Kalyan

Bigg boss 6:  బిగ్ బాస్ సీజ‌న్ 6లో జంట‌గా అడుగుపెట్టిన భార్యాభ‌ర్తలు మెరీనా, రోహిత్‌లను మూడు వారాల త‌ర్వాత బిగ్ బాస్ వేర్వేరు కంటెస్టెంట్లుగా చూస్తామ‌ని చెప్పేశాడు. దాంతో అప్పటి వ‌ర‌కూ ఒక‌రికొక‌రు స‌ల‌హాలు ఇచ్చుకుని టాస్క్‌లలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట అప్పటి నుండి విడివిడిగా పోరాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. దాంతో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా రోహిత్, మెరీనాల‌ను ఎవ‌రికి వారుగా జ‌డ్జ్ చేయ‌డం మొద‌లెట్టారు. అది ప్రధానంగా మెరీనాకు బాగా బ్యాడ్ అయ్యింది. టాస్క్ ల‌లో యాక్టివ్‌గా పాల్గొన‌డం కంటే వంటకే ప‌రిమిత‌మ‌యిపోయిన మెరీనాను అంద‌రూ ఈ వారం టార్గెట్ చేశారు.

Read Also: Malaika Arora : వయసులో చిన్నవాడు.. తప్పేంటి అంటున్న ముదురు భామ

హౌస్‌లో అన్ డిజ‌ర్వింగ్ ప‌ర్సన్ ఎవ‌రు అని శ‌నివారం నాగార్జున.. క‌న్ఫెష‌న్ రూమ్‌లో అడిగిన ప్రశ్నకు ఏకంగా ఏడుమంది మెరీనా పేరు చెప్పారు. ఆ త‌ర్వాత అర్జున్, రాజ్, వాసంతి పేర్లను ఇద్దరేసి హౌస్ మేట్స్ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇదే స‌మ‌యంలో మోస్ట్ డిజ‌ర్వింగ్ ప‌ర్సన్‌గా ఏకంగా ఎనిమిది మంది శ్రీహాన్ పేరును స‌జెస్ట్ చేశారు. చాలా లో-ప్రొఫైల్ లో హౌస్‌లోకి అడుగుపెట్టిన శ్రీహాన్ అత్యధిక శాతం మంది మ‌న‌సు దోచుకున్నాడ‌న‌డానికి ఇదే ఓ ఉదాహ‌ర‌ణ‌. ఇదిలా ఉంటే.. ఈ వారం నామినేష‌న్స్‌లో ఉన్న 12 మందిలో అర్జున్‌కు హౌస్ నుండి ఉద్వాస‌న ప‌లికిన‌ట్టుగా నెట్టింట ఓ వార్త వైర‌ల్‌గా మారింది. మ‌రి అప్ క‌మిట్ హీరో అర్జున్ క‌ళ్యాణ్ ఎలిమినేట్ అవ‌డానికి కార‌ణం ఏమిటో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇదే స‌మ‌యంలో అర్జున్‌కు మాన‌సికంగా ద‌గ్గర‌యిన‌ శ్రీస‌త్య ఈ ఎలిమినేష‌న్ ఎలా తీసుకుంటుందో చూడాలి.

Show comments