Bigg Boss 6: బిగ్‌బాస్-6 తెలుగు సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇనయా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున చెప్పేశారు. దీంతో మరొక కంటెస్టెంట్ బుధవారం ఎలిమినేట్ కానున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అయితే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన ఇనయాను బీబీ కేఫ్‌లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించాడు. గతంలో యాంకర్ శివ ప్రశ్నలకు అర్జున్ కళ్యాణ్, రాజ్ లాంటి వాళ్లు సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయారు. కానీ ఇనయా అలా కాదని శివ తెలుసుకోలేకపోయాడు. దీంతో ఆమె చెప్పిన పలు సమాధానాలకు అతడు తెల్లముఖం వేశాడు.
హౌస్‌లో ఉన్న సమయంలో నామినేషన్స్ జరిగేటప్పుడు ప్రతిసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నేనే అని అరిచేదానివి కదా అంటూ యాంకర్ శివ దెప్పిపొడిచాడు. అయితే ఇనయా మాత్రం తడుముకోకుండా ఎవరికి వారు అలా అనుకుని ఆడితేనే బిగ్‌బాస్ షోలో ముందుకు సాగగలం అంటూ సమాధానం ఇచ్చింది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా అని శివ అడగ్గా అది నామీద నాకున్న నమ్మకం అంటూ ఇనయా కౌంటర్ ఇచ్చింది. హౌస్‌లో సూర్యతో లవ్ ట్రాక్ సమయంలో నీ గ్రాఫ్ డౌన్ అయింది కదా అంటూ శివ అనగా.. నేనెప్పుడైనా లవ్ అని చెప్పానా అంటూ ఇనయా ప్రశ్నించింది. దీంతో శివ గుటకలు వేయాల్సి వచ్చింది. నీకు నచ్చకపోతే ఎన్ని స్టే్ట్‌మెంట్లు అయినా వదులుతావ్ అని శివ అనగా.. అవి స్టేట్‌మెంట్లు కాదని తనకు అనిపించింది చెప్తానని ఇనయా సమాధానం చెప్పింది.
Read Also: Oscar 2022: కీరవాణికే ఆస్కార్..?
రేవంత్ గురించి చెప్పాలని యాంకర్ శివ అడగ్గా.. రేవంత్ ఒకసారి ఒకలా.. మరోసారి మరోలా బిహేవ్ చేస్తాడని ఇనయా చెప్పింది. శివ మధ్యలో కల్పించుకుని అంటే నీలాగా అని అన్నాడు. రేవంత్ గురించి అడిగావు, నా గురించి ఎందుకు తీసుకువస్తున్నావ్.. తను నేను ఒకలాగే బిహేవ్ చేస్తామా అంటూ శివను ఇనయా పశ్నించింది. దీంతో శివ, ఇనయా ఇంటర్వ్యూ ప్రోమోను చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ఇనయా రాక్స్, శివ షాక్స్, ఆడియన్స్ క్లాప్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇనయా ఎలిమినేషన్‌ను పలువురు తప్పుబడుతున్నారు. బిగ్‌బాస్ షో ఫెయిర్‌గా జరగడం లేదని.. ఇష్టం వచ్చిన వాళ్లను హౌస్‌లో ఉంచుకుని ఇష్టం లేని వాళ్లను బయటకు పంపేస్తున్నారంటూ ఆడియన్స్ మండిపడుతున్నారు.