ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, అలాగే ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. మేష రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. గాయత్రీ అమ్మవారిని పసుపురంగు పుష్పాలతో పూజించాలి.
వృషభ రాశి వారు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబానికి అవసరమైనటువంటి సౌకర్యవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ.. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిధున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అయితే అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం అంత శ్రేయస్కరం కాదు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. వివిధ రూపాల్లో అనవసర ప్రయాణాలు ఏర్పడకుండా నియంత్రణను పాటించడం మంచిది. అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
