Wednesday Astrology October 28 2026: జీవితంలో ప్రతీరోజూ ఒక కొత్త ఆశతో, భిన్నమైన అనుభవాలతో ముందుకు సాగుతుంది. రాబోయే కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దైవారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (2026 అక్టోబర్ 28) ద్వాదశ రాశుల ఫలాలు మరియు పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను అందించారు. కింది వీడియోలో 12 రాశుల వారి బుధవారం దిన ఫలాలు ఉన్నాయి.
మకర రాశి వారు ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతమైన పదవులు లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించి, శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయాలి. కన్యా రాశి వారు కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వైద్యపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉంటూ సంయమనం పాటించాలి. సహచరుల సహకారంతో కష్టపడి పని చేసి ఆదాయ మార్గాలు మెరుగుపరుచుకుంటారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి అష్టకం పారాయణం చేయాలి.

