Wednesday Horoscope August 19 2026: వృషభ రాశి వారికి నేడు కలిసిరానుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. దూరప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. అమ్మవారికి విశేష పుష్పాలతో పూజించడం మంచిది. ధనస్సు రాశి వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో నూతన మార్గాలు సుగమమవుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఆనందం పొందుతారు. మీరు దత్త స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి సృజనాత్మక ఆలోచనలు పెరుగడమే కాకుండా స్నేహితుల ద్వారా ముఖ్య సమాచారం పొందుతారు. వ్యాపారంలో నూతన అవకాశాలను పరిశీలిస్తారు. సామాజిక, జనసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు. దక్షిణామూర్తి స్వామివారిని గన్నేరు పూలతో అర్చించడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 19 ఆగస్టు 2026 దినఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

