Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభాలే, డబ్బేడబ్బు!

Wednesday Horoscope

Wednesday Horoscope

Wednesday Astrology November 25 2026: మిథున రాశి వారు వ్యాపార వ్యవహారాలలో అనుకూలతలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆంజనేయ స్వామి వారికి విశేష తమలపాకుల అర్చన నిర్వహించాలి. సింహ రాశి వారికి వ్యవహారాలలో అనుకూలతలు ఉంటాయి. బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుని కష్టమైన పనులు పూర్తి చేస్తారు. శ్రీ నరసింహ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించడం మంచిది.

కుంభ రాశి వారికి ఇబ్బందులు నిదానంగా తొలగిపోయి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. విందు వినోదాలు మేలు చేస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. మీన రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అవివాహితులకు శుభవార్తలు వినిపిస్తాయి. బంధువులను కలుసుకుని దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకం పారాయణం చేయడం చాలా మంచిది. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (2026 నవంబర్ 25) నాటి రాశి ఫలాలను భక్తి టీవీ వేదికగా అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.