బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజూ అందుకే ఈరోజు ఆయన అనుగ్రహం కోసం జనాలు ప్రత్యేక పూజలను చేస్తారు.. దేవతలలో కెల్లా గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఆయన ఆది దేవుడుగా పూజలు చేస్తారు.. అయితే కొన్ని వస్తువులను సమర్పిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బుధవారం గణేశ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న గణేశుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుంది. ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు కొరత ఉండదు.. ఇక బెల్లం కాకుండా మోదకాలు సమర్పించాలి..
ఈరోజు గణేశునికి దుర్వ, లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా వినాయకుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఈ రెండు వస్తువులను సాధారణంగా గణపతి పూజిస్తారు. అయితే వీటిని ముఖ్యంగా బుధవారం నాడు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక నష్టాలు తొలగి పోవడంతో పాటు సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..
ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే బుధవారం నాడు గణేశుడికి 42 జాజికాయలను సమర్పించండి. ఇది మీ ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది..
బుధవారం రోజున వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టడం వల్ల ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. బుధవారం ఏదైనా శుభకార్యానికి వెళ్లే ముందు ఇలా చేయడం వల్ల ఆ పని విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు..
బుధవారం నాడు గణపతి అథర్వ శీర్ష పారాయణ చేసినా గణపతి ప్రసన్నుడై భక్తులకు ఉన్న అన్ని ఆటంకాలను తొలగిస్తాడు.. అప్పుడు అనుకున్న పనులు నెరవేరుతాయని పెద్దలు చెబుతున్నారు..