Site icon NTV Telugu

varalakshmi Vratham: వ్రతం అప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలి?

varalakshmi Vratham

varalakshmi Vratham

శ్రావణ మాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది.. పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు.. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము అనుకునే లోపే కొన్ని కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మహిళలను ఆందోళన కలిగించే విషయం నెలసరి.. వ్రతం రోజూ ఇలా పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అమ్మవారికి పూజలను భక్తి శ్రద్దలతో చెయ్యడం వల్ల సుఖ సంతోషాలు వెల్లు విరిస్తాయని పండితులు చెబుతున్నారు.. అందుకే ప్రతి పనిని ఒక నియమం ప్రకారం చెయ్యడం మంచిది.. ఒకవేళ వ్రతం రోజూ నెలసరి వస్తే ఆ తర్వాత వారం అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.. శ్రావణ మాసం అయిపోతే దేవి నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చునని చెబుతున్నారు.. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లీ.. అమ్మను భక్తి తో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.. అందుకే మహిళలు శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు..

ఈ మాసంలో ప్రతి శుక్రవారం వ్రతం చేసుకుంటారు.. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మంచిది.. భర్త ఆరోగ్యం, కుటుంబ సంతోషం కోసం అమ్మవారికి మహిళలు ప్రత్యేక వ్రతాన్ని, నోములను చేసుకుంటారు.. కొందరు మహిళలు ఈ పండుగను చాలా సింపుల్గా జరుపుకుంటే మరికొందరు మాత్రం ఇంట్లో అమ్మవారిని చక్కగా రెడీ చేసి భక్తిశ్రద్ధలతో పూజించి ముత్తైదువులకు వాయనాలు కూడా అందిస్తూ ఉంటారు.. మరి కొంతమంది వచ్చిన ఆడవాళ్లకు రుచికరమైన భోజనాన్ని పెట్టి తాంబూలం ఇస్తారు.. వారికి తాంబులం, పసుపు, కుంకుమ, రవికను, పండును ఇచ్చి ముత్తైదువులతో ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయని పండితులు చెబుతున్నారు..

Exit mobile version