NTV Telugu Site icon

Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం ఇలా చేస్తే.. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది.. డబ్బే డబ్బు..

Vratam

Vratam

శ్రావణ మాసం అనగానే మహిళల మాసం అంటారు.. ఈ మాసంలో వ్రతాలు, నోములు చేసుకుంటూ కుటుంబ క్షేమం, భర్త ఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే మాసంలో వస్తుంది.. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు.. సుమంగళి మహిళలను పిలిచి భర్త చల్లగా ఉండాలి వాయినాలు ఇస్తారు..ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పూజలు జరుపుకుంటున్న సరే మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆడవాళ్ళలో ఆత్రుత ఉంటుంది. ఈ సంవత్సరం శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి.

భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకోవచ్చు. కొత్త బట్టలు కొంటారు. బంగారం కొనుక్కుంటారు. కొందరు మంచి రోజులు కాబట్టి నోములు పట్టుకుంటారు. గృహప్రవేశాలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుపుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం శ్రవణా నక్షత్రం స్వామివారికి అమ్మవారు నిత్యా నిత్యాయన పాయని భగవంతుడు. ఏ అవతారం అనుకున్నా ఆయనను విడిచి అమ్మవారు ఉండదు. అందుకే అమ్మవారిని నిత్యనాపాయిని అంటారు. వారికి సంబంధించిన ఈ నెల లక్ష్మీప్రధమని పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందని చెబుతున్నారు..

ఈ ఏడాది శ్రావణమాసం శుక్రవారంములు 5 నాలుగు, మంగళవారాలు వస్తున్నాయి. శుక్రవారం పూజా లక్ష్మి పూజ, మంగళవారాలు గౌరీదేవి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తుంది..పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి అమ్మవారి పూజా కొరకు ఇల్లు శుభ్రపరుచుకొని పూజకు సామాగ్రిని అన్ని సర్దుకుని తామర పువ్వులు లక్ష్మీదేవికి నివేదించాలి. అవి అందుబాటులో లేనిచో ఏ పూలైన ఉపయోగించవచ్చు. అమ్మవారిపై భక్తి ప్రధానం. పూజలో అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. పూజ జరుగుతున్న తర్వాత చివరిలో అమ్మవారికి ఐదు రకాలు వంటలతో నైవేద్యం పెడతారు. సెనగపప్పుతో కూడిన నైవేద్యం కూడా సమర్పిస్తారు.. ఎవరికి తోచిన శుక్రవారం వాళ్లు వ్రతం చేసుకుంటారు.. నియమ నిష్టలతో చేసే పూజ వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది..