Bathukamma Day-2: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన నిన్న(అక్టోబర్ 2) ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసి ఆడిపాడిన మహిళలు రెండోరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేయనున్నారు. బతుకమ్మ పండుగ రెండో రోజు కావడంతో మహిళలు రెండు వరుసలలో బతుకమ్మ పేరుస్తారు. తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి… ఇళ్లు శుభ్రం చేసి బతుకమ్మ కోసం తెచ్చిన పూలతో అటుకుల బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మ తయారీలో తంగేడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి. స్త్రీలు ఈ పువ్వులను తప్పని సరిగ్గా ఉండే విధంగా చేసుకుంటారు. బతుకమ్మ పేర్చిన తర్వాత గౌరమ్మను కూడా చేస్తారు. నేడు బతుకమ్మ వేడుకలను పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా జరుపుకుంటారు. ఈరోజు అటుకులని నైవేద్యంగా సమర్పిస్తున్నందున అటుకులనే బతుకమ్మ అంటారు.
Read also: K. A. Paul: కొండా సురేఖ మాటలకు అమెరికాలో పరువు నష్టం దావా వేస్తారు..
పిల్లలు బతుకమ్మ చుట్టూ ఆడి పాడిన తర్వాత, పెద్దలు వారికి ఇష్టమైన బెల్లం మరియు అటుకులను పంచుతారు. ఆ అటుకును చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒక రాగి పళ్ళెం తీసుకుని దానిపై ముందుగా తామర ఆకులు లేదా గునుగు, తంగేడు పూల ఆకులను వేయాలి. గునుగు పువ్వులు వరుసలో ఉంచిన తర్వాత రకరకాల పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. ఆ తర్వాత గౌరమ్మను సిద్ధం చేసి బతుకమ్మ చెంత ఉంచుతారు. ఆ తర్వాత అటుకును నైవేద్యంగా సమర్పిస్తారు. వివిధ రకాల పూలతో ముఖ్యంగా గునుగు, తంగేడు పూలతో మహిళలు బతుకమ్మను ఎంతో ఆకర్షణీయంగా పిలుస్తారు. మరోవైపు అటుకుల బతుకమ్మతో పాటు దేవీ నవరాత్రులు కూడా ఈరోజు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
TPCC Chief Mahesh Goud: ఇక చాలు ఆపండి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ విజ్ఞప్తి..