Lunar Eclipse 2023: హిదూశాత్రంలో గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి పైన ఉన్న వారికి సూర్యుడు కనపడడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. అలానే కొన్ని సందర్భాల్లో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డుగా ఉన్నప్పుడు భూమిపైనా ఉన్న వాళ్లకి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. కాగా ఈమధ్యనే అక్టోబర్ 14వ తేదీన రెండో సూర్య గ్రహణం పూర్తయ్యింది. అయితే అక్టోబర్ 28వ తేదీన 2వ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
Read also:Telangana Inter Exam Fee Dates: విద్యార్థులకు ఆరెల్ట్.. ఇంటర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల..
కాగా ఇది ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహం. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన అంటే శనివారం రాత్రి 11:31 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 29వ తేదీ అర్ధరాత్రి 1:45 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. కాగా మధ్యాహ్నం 3:36 గంటలకు చంద్ర గ్రహణం ముగియనుంది. ఈ నేపథ్యంలో యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రం లోని కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపించనుంది. భారత్ లో దాదాపు అన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం అద్భుతమైన దృశ్యాలతో కనిపించి కనువిందు చేయనుంది. ఈ గ్రహణాన్ని చూడడానికి ఎలాంటి సాధనం అవసరం లేదు. కానీ మరింత స్పష్టంగా చూడాలి అనుకునేవాళ్లు చిన్న టెలిస్కోప్‌లలో చూడవచ్చు.