NTV Telugu Site icon

Koti Deepotsavam 2024: దారులన్నీ ఇల కైలాసం వైపే.. కోటి దీపోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2024: కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నిర్వహించే కోటి దీపోత్సవం గురించి భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.. ఇల కైలాసంలో ప్రతీ రోజు ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో కల్యాణం.. లింగోద్భవం.. వాహనసేవ.. భక్తులచే స్వయంగా అభిషేకాలు, అర్చనలు.. మఠాధిపతులు, పీఠాధిపతులు.. రాజకీయ నేతలు, ప్రముఖులు ఉపన్యాసానాలు.. ప్రవచనాలు ఇలా ఆద్యంతం.. కోటి దీపాల పండుగ కట్టి పడేస్తోంది.. ఇక, కోటి దీపోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ప్రతీ ఏటా కోటిదీపోత్సవానికి హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.. సాయంత్రం నుంచి రాత్రి వరకు కోటి దీపాల వెలుగులు, శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలు వెలుగిపోతుంటాయి.. ఇక, కోటి దీపోత్సవం నేపథ్యంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పేర్కొంది గ్రేటర్‌ ఆర్టీసీ.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్‌ సిటీలోని 18 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ప్రకటించింది.. ఆ వివరాల కోసం.. 99592 26160, 99592 26154 మొబైల్‌ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది.. కాగా, రేపటి నుంచి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న కోటి దీపోత్సవానికి ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.. ఇప్పటికే ఏర్పాటు చేసిన సెట్లు.. ఆ కైలాసమే ఇలకు దిగి వచ్చిందా? అన్నట్టుగా ఆకట్టుకుంటోంది..

Show comments