Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rama Navami 2026: సత్యం, ధర్మం, బాధ్యతలకు కట్టుబడి ఉండే ఆదర్శవంతమైన దేవుడు శ్రీరాముడు. రేపు శ్రీరాముడి జన్మదినం. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రామ నవమి ముఖ్యమైన, పవిత్రమైన పండుగ. ఈ రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి శ్రీరాముని ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. అలాంటి రాముడి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. రాయాలంటే పుస్తకాలు సరిపోవు. శ్రీరాముడి జననం లోక కళ్యాణం.. ధైర్యశాలీ ధీశాలి ధీరుడు.. ఎదురులేనివాడు.. ఎదుర్కొనువాడు.. గుణంలో శ్రేష్టుడు.. రూపంలో సత్యవాక్ పరిపాలకుడు.. మత్స్యర్యం లేనివాడు.. అందరికీ మేలుచేసే మనసున్నవాడు.. తల్లిదండ్రుల పట్ల భక్తిభావంగలవాడు.. పెద్దల పట్ల వినయవిధేయతలు గలవాడు.. ఏకపత్నీవ్రతుడు.. అందమున్నవాడు.. అసూయలేనివాడు.. అన్నదమ్ముల పట్ల ఆప్యాయత గలవాడు.. కష్టలెన్నెదురైనా ఓర్పుతో నేర్పుగా విజయం పొందిన సాహసికుడు.. అందరికీ లోకంలో ఆదర్శప్రాయుడు.. అందరివాడు శ్రీరాముడు.. అయితే.. మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సి గుణాలు చాలా ఉన్నాయి. ఓ వ్యక్తి ఆయన నుంచి స్వీకరించాల్సి గుణగణాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Gautham Menon: డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టు కథ చెప్పిన స్టార్ డైరెక్టర్.. షాకిచ్చిన హైకోర్టు!
Also Read
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
- Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
తండ్రి మాటను జవదాటని కొడుకు. తల్లి కోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలి. ధర్మం కోసం పోరాడిన యోధుడు. ప్రజల సంక్షేమానికి విలువ ఇచ్చిన పాలకుడు.. ఇలా ఒక్కటేమిటి ఆయనలో ఉన్నవన్నీ మంచి గుణాలే. శ్రీరామచంద్రుడిని ధర్మానికి ప్రతీకగా చెప్తుంటారు. అందువల్లే అయోధ్య రామయ్యే ఈ అఖండ భారతదేశంలో అందరికీ ఆదర్శంగా మారాడు. రాముడి నుంచి ఏం నేర్చుకోవాలి? అని ఆలోచించాల్సిన పనిలేదు. రాముడు చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే. ఆయన అలవాట్లు, పద్ధతులు అన్నీ ప్రతి ఒక్కరూ నేర్చుకోదగినవే. శ్రీరాముడిని ఓ కొడుకుగా గమనిస్తే.. రాముడి తండ్రి ఏం చెప్పినా గౌరవం, ప్రేమతో పాటిస్తాడు. తండ్రి గౌరవం కోసం తన సౌకర్యాలన్నీ వదిలి అడవులకు వెళ్లాడు. రామయ్య సవతి తల్లిని సైతం సొంత తల్లిగా భావించాడు. సవతి తల్లి.. కొడుకు మీద ప్రేమ చూపించకపోయినా, తన సొంత బిడ్డకు అనుకూలంగా ప్రవర్తించినా ఆమెను సొంత తల్లిలాగే చూశాడు. ఆమె కోరికలను గౌరవించాడు. ఇక అయోధ్య రామయ్య ఏకపత్నీ వ్రతుడని పెద్దగా చెప్పనవసరం లేదు. భార్యను రక్షించుకునేందుకు గొప్ప పోరాటం చేశాడు. ఆమె రక్షణ, స్వేచ్ఛ కోసం యుద్ధాన్ని జయించాడు. రాజుగానూ రామయ్య ఎంతో ఆదర్శంగా నిలిచారు. ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాజు రాముడు. సొంత సుఖాలు, ఆనందం, అవసరాల కంటే రాజ్యమే ముఖ్యమని చాటాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రాముడి లాంటి రాజు పుట్టలేదు. అందుకే ఇప్పటికీ రామరాజ్యమే గొప్పదని చెప్తుంటారు. ఇలా రాముడిలోని మంచి లక్షణాలను మనం నేర్చుకుందాం.. ఆయన అడుగు జాడల్లో నడుద్దాం.. జై శ్రీరామ్..
READ MORE: Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..
తాజావార్తలు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!