Subrahmanya Swamy Pooja: మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ.. ఎలాంటి విశిష్టతలు లభిస్తాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subrahmanya Swamy Pooja: హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయ లేదా మురుగన్) పూజకు మంగళవారం చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజించడానికి ప్రధాన కారణాలు చూస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజుకు కుజుడు (Mars) అధిపతి. సుబ్రహ్మణ్య స్వామిని శక్తి, పరాక్రమం, ధైర్యం, యుద్ధ దేవతగా భావిస్తారు. కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి మధ్య శక్తిపరంగా అలాగే గుణాలపరంగా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా గమనించాలిసిన విషయం ఏమిటంటే.. నవగ్రహాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. ఇక జాతకంలో కుజ దోషం ఉన్నవారు లేదా అంగారక గ్రహం (కుజుడు) వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాలు తొలగి, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మంగళవారం నాడు ఆయనను పూజించడం ద్వారా శత్రువులపై విజయం, మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
5G సపోర్ట్, బెస్ట్ ఫీచర్స్.. 7040mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A11+ భారత్‌లో లాంచ్!
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇందులో ముఖ్యంగా అప్పుల బాధలు (ఋణాలు) తొలగిపోతాయి. మంగళ గ్రహాన్ని ఋణకారకునిగా కూడా భావిస్తారు. కాబట్టి స్వామి పూజతో రుణ బాధలు తీరుతాయి. ఇంకా సంతానం లేని వారు మంగళవారం స్వామిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే భయం, పిరికితనం తొలగిపోయి.. చేయబోయే కార్యాల్లో విజయం సాధించడానికి అవసరమైన ధైర్యం, పరాక్రమం లభిస్తాయి. ముఖ్యంగా శారీరక శక్తి, ఆరోగ్యం మెరుగుపడతాయని నమ్మకం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆటంకాలు తొలగి, సుఖ సంతోషాలు కలుగుతాయి. మంగళవారం రోజున ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, షణ్ముఖ దండకం పారాయణం చేయడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పాలు, పంచామృతం, తేనె వంటి వాటితో అభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పువ్వులు, పదార్థాలతో పూజ చేయడం శుభకరం. కాబట్టి సుబ్రహ్మణ్య అష్ట శతనామావళిని ఇక్కడ ఇస్తున్నాము. పఠించి దేవుడి కృపలో పాల్గొనండి.
సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి:
1. ఓం స్కందాయ నమః
2. ఓం గుహాయ నమః
3. ఓం షణ్ముఖాయ నమః
4. ఓం ఫాలనేత్ర సుతాయ నమః
5. ఓం ప్రభవే నమః
6. ఓం పింగళాయ నమః
7. ఓం క్రుత్తికాసూనవే నమః
8. ఓం సిఖివాహాయ నమః
9. ఓం ద్విషడ్భుజాయ నమః
10. ఓం ద్విషన్ణే త్రాయ నమః
11. ఓం శక్తిధరాయ నమః
12. ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః
13. ఓం తారకాసుర సంహార్త్రే నమః
14. ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
15. ఓం మత్తాయ నమః
16. ఓం ప్రమత్తాయ నమః
17. ఓం ఉన్మత్తాయ నమః
18. ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
19. ఓం దీవసేనాపతయే నమః
20. ఓం ప్రాఙ్ఞాయ నమః
21. ఓం కృపాళవే నమః
22. ఓం భక్తవత్సలాయ నమః
23. ఓం ఉమాసుతాయ నమః
24. ఓం శక్తిధరాయ నమః
25. ఓం కుమారాయ నమః
26. ఓం క్రౌంచ దారణాయ నమః
27. ఓం సేనానియే నమః
28. ఓం అగ్నిజన్మనే నమః
29. ఓం విశాఖాయ నమః
30. ఓం శంకరాత్మజాయ నమః
31. ఓం శివస్వామినే నమః
32. ఓం గుణ స్వామినే నమః
33. ఓం సర్వస్వామినే నమః
34. ఓం సనాతనాయ నమః
35. ఓం అనంత శక్తియే నమః
36. ఓం అక్షోభ్యాయ నమః
37. ఓం పార్వతిప్రియనందనాయ నమః
38. ఓం గంగాసుతాయ నమః
39. ఓం సరోద్భూతాయ నమః
40. ఓం అహూతాయ నమః
41. ఓం పావకాత్మజాయ నమః
42. ఓం జ్రుంభాయ నమః
43. ఓం ప్రజ్రుంభాయ నమః
44. ఓం ఉజ్జ్రుంభాయ నమః
45. ఓం కమలాసన సంస్తుతాయ నమః
46. ఓం ఏకవర్ణాయ నమః
47. ఓం ద్వివర్ణాయ నమః
48. ఓం త్రివర్ణాయ నమః
49. ఓం సుమనోహరాయ నమః
50. ఓం చతుర్వ ర్ణాయ నమః
51. ఓం పంచ వర్ణాయ నమః
52. ఓం ప్రజాపతయే నమః
53. ఓం ఆహార్పతయే నమః
54. ఓం అగ్నిగర్భాయ నమః
55. ఓం శమీగర్భాయ నమః
56. ఓం విశ్వరేతసే నమః
57. ఓం సురారిఘ్నే నమః
58. ఓం హరిద్వర్ణాయ నమః
59. ఓం శుభకారాయ నమః
60. ఓం వటవే నమః
61. ఓం వటవేష భ్రుతే నమః
62. ఓం పూషాయ నమః
63. ఓం గభస్తియే నమః
64. ఓం గహనాయ నమః
65. ఓం చంద్రవర్ణాయ నమః
66. ఓం కళాధరాయ నమః
67. ఓం మాయాధరాయ నమః
68. ఓం మహామాయినే నమః
69. ఓం కైవల్యాయ నమః
70. ఓం శంకరాత్మజాయ నమః
71. ఓం విస్వయోనియే నమః
72. ఓం అమేయాత్మా నమః
73. ఓం తేజోనిధయే నమః
74. ఓం అనామయాయ నమః
75. ఓం పరమేష్టినే నమః
76. ఓం పరబ్రహ్మయ నమః
77. ఓం వేదగర్భాయ నమః
78. ఓం విరాట్సుతాయ నమః
79. ఓం పుళిందకన్యాభర్తాయ నమః
80. ఓం మహాసార స్వతావ్రుతాయ నమః
81. ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
82. ఓం చోరఘ్నాయ నమః
83. ఓం రోగనాశనాయ నమః
84. ఓం అనంత మూర్తయే నమః
85. ఓం ఆనందాయ నమః
86. ఓం శిఖిండికృత కేతనాయ నమః
87. ఓం డంభాయ నమః
88. ఓం పరమ డంభాయ నమః
89. ఓం మహా డంభాయ నమః
90. ఓం క్రుపాకపయే నమః
91. ఓం కారణోపాత్త దేహాయ నమః
92. ఓం కారణాతీత విగ్రహాయ నమః
93. ఓం అనీశ్వరాయ నమః
94. ఓం అమృతాయ నమః
95. ఓం ప్రాణాయ నమః
96. ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
97. ఓం విరుద్దహంత్రే నమః
98. ఓం వీరఘ్నాయ నమః
99. ఓం రక్తాస్యాయ నమః
100. ఓం శ్యామ కంధరాయ నమః
101. ఓం సుబ్ర హ్మణ్యాయ నమః
102. ఓం గుహాయ నమః
103. ఓం ప్రీతాయ నమః
104. ఓం బ్రాహ్మణ్యాయ నమః
105. ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
106. ఓం వేదవేద్యాయ నమః
107. ఓం అక్షయ ఫలదాయ నమః
108. ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!