Shivaratri New Song 2025: శివరాత్రి వచ్చేసింది.. ఇప్పటికే పలు శైవక్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు, శివరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. “దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు.. ఇక, “జంగ జంగ జంగమ్మ.. జగమునేలె లింగమ్మ.. ఎల్లజనుల గుండెలో తరంగమా..” అంటూ సాగే పాటను ప్రముఖ సింగర్ రేవంత్ అందుకున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని వనిత టీవీ విడుదల చేసిన ఈ ప్రత్యేక గీతం.. ఆది దేవుని భక్తులను ఆకట్టుకుంటుంది..
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా.. ఏ కార్యానికైనా.. శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు అని చెబుతారు.. ఆది దేవుడిని ప్రతి నిత్యం స్మరిస్తాం.. ఇక, శివరాత్రి వచ్చిందంటే చాలు.. శైవక్షేత్రాలు కిటకిటలాడిపోతాయి.. వేదాలలో శివుడు రుద్రునిగా.. శైవంలో శివుని పరమాత్మగాను.. ఆదిదేవునిగాను భావిస్తారు. శివరాత్రి సందర్భంగా.. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకమైన పాటలు వచ్చాయి.. శివరాత్రి 2025 పురస్కరించుకుని వనిత టీవీ విడుదల చేసిన ప్రత్యేక గీతాన్ని చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..