Parijatha Yogam 2026: రేపే పారిజాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు.!

  • ఫిబ్రవరి 13న అరుదైన గ్రహ సమ్మేళనం
  • బుధ, గురు, శుక్రుల కలయికతో పారిజాత యోగం
  • నాలుగు రాశుల వారికి ధన, ఉద్యోగ, విజయ అవకాశాలు
  • గోల్డెన్ డేస్ ప్రారంభం.. అదృష్టం తలుపుతట్టే సమయం
Parigatha Yogam

Parigatha Yogam

Astrology Predictions : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫిబ్రవరి 13న గ్రహ గమనంలో ఒక అరుదైన మార్పు చోటుచేసుకోబోతోంది. బుధ, గురు, , శుక్ర గ్రహాలు ఒకే మార్గంలోకి రావడం వల్ల ‘పారిజాత యోగం’ ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా మొత్తం 12 రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం ‘గోల్డెన్ డేస్’ ప్రారంభం కానున్నాయి.

AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!

ఏమిటీ పారిజాత యోగం?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మూడు శుభ గ్రహాలు (బుధుడు, గురుడు, శుక్రుడు) ఒకే రేఖలో లేదా అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం సంభవిస్తుంది. ఎవరి జాతకంలోనైతే ఈ యోగం ఉంటుందో లేదా గోచారంలో ఈ యోగం ఏర్పడుతుందో, వారు అపారమైన ధనలాభం, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ముఖ్యంగా ఎవరి ఇంట్లోనైతే ‘పారిజాతం’ చెట్టు ఉంటుందో వారికి ఈ సమయంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.

అదృష్టం వరించే 4 రాశులు ఇవే:

1. కుంభ రాశి: ఈ రాశి వారికి పారిజాత యోగం వల్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

2. ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు లేదా తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది.

3. మకర రాశి: వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు , ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు చేకూరుతాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.

4. మీన రాశి: మీన రాశి వారికి అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి , వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థానాలు లభిస్తాయి. ధన ప్రవాహం పెరగడంతో పాటు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..