NTV Telugu Site icon

Sri Nimishambhika Devi: ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు..

Nimishambika Temple

Nimishambika Temple

Sri Nimishambhika Devi: మనలో చాలామంది రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఈ గుడికి వెళ్లి అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అప్పులు ఉన్నవారు నిమిషాంబ దేవి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అప్పులు తీరిపోతాయట. బోడుప్పల్‌లోని ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. నిమిషాంబ దేవి ఆలయానికి వెళ్లి ఏం కోరుకున్నా వేగంగా కోరికలు నెరవేరుతాయని భక్తులు అంటున్నారు. పెళ్లికాని వారు ఈ దేవతను దర్శించుకోవడం వల్ల త్వరలో వివాహం జరుగుతుంది. ఈ ఆలయాన్ని 2006లో హైదరాబాద్‌లోని బోడుప్పల్ లో నిర్మించినట్లు సమాచారం.

Read also: Hibiscus Tea: వావ్.. మందార పువ్వుల టీ తాగారా.? తాగితే ఇన్ని లాభాలా..?

ఈ ఆలయంలో నిముషంలోగా కోరిక కోరుకోవాలని 21 సెకన్లు, 21 నిమిషాల 21 రోజుల్లోనే మన కష్టాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలని పండితులు వెల్లడిస్తున్నారు. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించడం మంచిది. నిమిషాంబ దేవికి నిమ్మకాయలను నైవేద్యంగా పెట్టి ఆ మాలలను ఇంట్లో ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. నిమిషాంబ దేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు, మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ నిమిషాంబ దేవికి నిమ్మకాయలు, గాజులు, వస్త్రాలు సమర్పింస్తుంటారు భక్తులు. గంజాం స్థానంలో దేవి నిమిషాంబ దర్శనమిచ్చింది. భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం వల్ల మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో నిమిషాంబ దేవి ఆలయాలు ఉండగా, ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన భక్తులు అనుకూలమైన ఫలితాలను పొందుతారని భక్తుల విశ్వాసం.

Read also: Pakistan : పాకిస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతం.. ఐదుగురికి గాయాలు

నిమిషాంబ అనే అర్థం..

నిమిషాంబ దేవిని శివుని భార్య అయిన పార్వతి దేవి అవతారంగా భావిస్తారు. నిమిషాంబ దేవి తన భక్తుల కష్టాలను, కష్టాలను నిమిషములోనే తొలగిస్తుందని ఒక నమ్మకం. అందుకే ఆమెను నిమిషాంబ అని పిలుస్తారు. నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతి పేరు. సోమవంశ ఆర్యక్షత్రియ ముత్తరస రాజు ముక్తరాజు ఒక నిమిషంలో రాక్షసులతో చేసిన పోరాటంలో శ్రీ నిమిషాంబ తనకు సహాయంగా వస్తాడని వరం పొందాడు. అందుకే మౌక్తికేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు.

పూర్తి వివరాల కోసం కింద లింక్ పై క్లిక్ చేయండి..

Pakistan : పాకిస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతం.. ఐదుగురికి గాయాలు

Show comments