Monday Horoscope October 19 2026: జీవితంలో ప్రతీరోజూ కొత్త ఉత్సాహాన్ని, అనేక అవకాశాలను మోసుకొస్తుంది. ఏ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దేవతను ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు సోమవారం (2026 అక్టోబర్ 19) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు.
మకర రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి ఆర్థిక లాభాలు అందుకుంటారు. లక్ష్యాలను చేరుకుంటారు. టెక్నికల్ వ్యవహారాలలో మంచి ప్రతిస్పందన లభిస్తుంది. శ్రీ కామాఖ్య అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించాలి. మీన రాశి వారు ఆధ్యాత్మిక, దైవ చింతనా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సహకారాలు అందుతాయి. డబ్బు రాక ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మేలు చేస్తుంది. అష్టభైరవి అమ్మవారిని ఆరాధించి లలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించుకోవడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

