Monday Astrology: నేడు మకర రాశి వారికి వ్యాపారంలో లాభాల శాతం గణనీయంగా పెరుగుతుంది. సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. శ్రీరాముని రామరక్షా స్తోత్రం పారాయణం చేయాలి. ఈ రోజు వృశ్చిక రాశి వారు నూతన వ్యాపారాల ప్రారంభం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధిని కాపాడుకుంటూ.. ఆర్థిక లావాదేవీలలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ ప్రయాత స్తోత్రం పారాయణం చేయాలి.
కన్యా రాశి వారికి రచయితలు, పత్రికా రంగంలోని వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ధైర్యసాహసాలతో కష్టమైన పనులను పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుని విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని స్మరించి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు సోమవారం (2026 నవంబర్ 23) నాటి రాశి ఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.

