Monday Astrology August 17 2026: కన్యా రాశి వారు చాకచక్యంతో సంక్లిష్టమైన ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు డబ్బు రాకతో సంపద పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి కవచ పారాయణం చేయడం మంచిది. మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. నేడు శ్రీ సత్యనారాయణ స్వామివారికి తులసి అర్చన నిర్వహించడం మంచిది.
కుంభ రాశి వారు వ్యాపార భాగస్వాములతో కీలక సమావేశాలు నిర్వహిస్తారు. ఉద్యోగపరమైన అంశాల్లో కీలక చర్చలు జరుపుతారు, కుటుంబ శుభకార్యాల్లో పాల్గొంటారు. మీకు అనుకూలించే దైవం.. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. నాగ కవచ పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు సోమవారం (17 ఆగస్టు 2026) దినఫలాలను అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఉన్నాయి.

