Site icon NTV Telugu

Lunar Eclipse : ప్రారంభమైన చంద్రగ్రహణం..సూతక కాలం నియమాలు ఇవే.!

Lunar El

Lunar El

ప్రకృతిలో సంభవించే అద్భుత ఖగోళ సంఘటనలలో ఒకటైన చంద్రగ్రహణం నేడు (మార్చి 3, 2026) ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత్‌లో కనిపిస్తుండటంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా తోడైంది. ఈ గ్రహణం సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోయే ‘బ్లడ్ మూన్’ (Blood Moon) దృశ్యం కనువిందు చేయనుంది.

 Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?

గ్రహణం సమయాలు (భారత కాలమానం ప్రకారం):

భారత్‌లో ఎప్పుడు కనిపిస్తుంది?

భారత్‌లో ఈ గ్రహణం ‘గ్రస్తోదిత’ రూపంలో కనిపిస్తుంది. అంటే చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ముంబై , హైదరాబాద్ వంటి ప్రాంతాలలో సాయంత్రం 6:26 గంటల సమయంలో చంద్రోదయం అయినప్పటి నుండి 6:46 గంటల వరకు (గ్రహణం విడిచే వరకు) దీనిని చూడవచ్చు.

సూతక కాలం , నియమాలు:
చంద్రగ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సూతకం ఈరోజు ఉదయం 6:20 గంటలకే ప్రారంభమైంది.

ఏం చేయకూడదు: సూతక కాలంలో ఆహారం వండటం, తినడం, పూజలు చేయడం , దైవ విగ్రహాలను తాకడం నిషిద్ధం.

ఏం చేయాలి: ఈ సమయంలో గాయత్రీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం లేదా భగవంతుని స్మరణ చేయడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత (సాయంత్రం 6:46 గంటలకు) స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకుని దానధర్మాలు చేయడం శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలు: గర్భిణీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉండి దైవ ప్రార్థన చేసుకుంటే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు:
సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చని నాసా తెలిపింది. టెలిస్కోప్ లేకపోయినా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఈ చంద్రగ్రహణం సింహరాశి , పూర్వాఫాల్గుణి నక్షత్రంలో సంభవిస్తోంది. దీని ప్రభావం వివిధ రాశులపై ఎలా ఉంటుందో మీ వ్యక్తిగత జాతకాలను బట్టి తెలుసుకోవచ్చు.

Kollywood : ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో ఫుల్ క్రేజ్

Exit mobile version