Site icon NTV Telugu

Koti Deepotsavam: ఐదోరోజు అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు

Harish Rao

Harish Rao

భక్తి టీవీ కోటి దీపోత్సవం ఐదో రోజు అంగరంగ వైభవంగా సాగింది. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదో రోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్‌రావు దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవంలో భాగంగా ముందుగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతర బ్రహ్మశ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం జరిగింది. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.

ఆ తర్వాత విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం, సింహ వాహన సేవ కన్నుల పండువగా సాగాయి. చివరగా సకల శుభాలను కలిగించే సప్త హారతి, భక్తులను మైమరిపించేలా లింగోద్భవం జరిగాయి.

కాగా ప్రతీ ఏటా కార్తిక మాసంలో ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు.. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కార్తిక మాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలు ఓం నమఃశివాయా నామ స్మరణతో మార్మోగిపోతున్నాయి.. విశేషమైన భక్తుల మధ్య.. అన్ని కార్యక్రమాలు ఆద్యంతం కోటిదీపోత్సవం ఐదో రోజు కన్నుల పండుగగా సాగాయి.

Exit mobile version