Site icon NTV Telugu

Koti Deepotsavam: కోటి దీపోత్సవంలో 9వ రోజు ఇలా..

Koti Deepotsavam 9

Koti Deepotsavam 9

Bhakthi TV Koti Deepotsavam: కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవంపైనే ఉంటుంది.. గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది మంది భక్తుల మన్ననలు అందుకున్న ఈ కార్యక్రమం.. గత నెల 31వ తేదీన ప్రారంభమైంది.. ఈ నెల 14వ తేదీతో ముగియనుంది.. ఇక, ఈ కోటి దీపాల ఉత్సవంలో భాగంగా.. సోమవారం ఎనిమిదో రోజు కన్నులపండుగా కార్యక్రమాలు జరిగాయి.. ఇవాళ తొమ్మిదో రోజు కన్నుల పండుగగా నిర్వహించేందుకు రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సన్నద్ధమైంది.. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. అందరి దేవుళ్లను, అన్ని ఆలయాలను ఒకేచోట చూసే భాగ్యం భక్తులకు కలుగుతోంది.

Read Also: Koti Deepotsavam: కోటి దీపోత్సవం 8వ రోజు హైలైట్స్‌.. శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం

తొమ్మిదో రోజు జరగనున్న కార్యక్రమాల విషయానికి వస్తే

* అనుగ్రహ భాషణం: శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ (వ్యాసాశ్రమం, ఏర్పేడు), శ్రీ అసంగానందగిరి స్వామీజీ (ఉత్తరాధిపతి వ్యాసాశ్రమం, ఏర్పేడు), శ్రీ వ్రతధర రామానుజ జీయర్‌ స్వామీజీ (జగన్నాథ మఠం, హైదరాబాద్‌)

* ప్రవచనామృతం: పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ గరికపాటి నరసింహారావు

* వేదికపై పూజ: రాహు కేతు పూజ

* భక్తులచే పూజ: నాగ ప్రతిమలకు రాహు కేతు పూజ

* కల్యాణం: శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణం

* వాహన సేవ: అశ్వ వాహనం, సింహవాహనం

ఇక, కోటిదీపోత్సవంలో 8వ రోజు కార్తిక సోమవారం కావడంతో.. ఎన్టీఆర్ స్టేడియం భక్త జనసంద్రంగా మారింది. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్న కోటి దీపాల ఉత్సవానికి రండి.. తరలిరండి.. అంటూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది..

 

Exit mobile version