Koti Deepotsavam Day 12: కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పన్నేండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం భక్త కోలాహలం మధ్య శివ నామస్మరణతో మార్మోగింది. వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుండటం నిజంగా గర్వకారణం.
READ MORE: Nidhi Agarwal : 8 ప్లాపులు.. నిధి అగర్వాల్ కు ప్రభాస్ ఒక్కడే దిక్కు..
ఈరోజు నిర్వహించిన విశేష కార్యక్రమాలు భక్తి తరంగాలను మరింతగా ఉద్ధరిస్తూ భక్తులని ఆధ్యాత్మికానందంలో ముంచాయి. పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి (శ్రీపీఠం, కాకినాడ), పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్ (మహామండలేశ్వర్, బృందావనం) గారిచే అనుగ్రహ భాషణం నిర్వహించారు. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనామృతం వినిపించారు. వేదికపై బాసర సరస్వతీదేవి మహాపూజ, కోల్‌కతా కాళీ కుంకుమ పూజ వైభవంగా జరిగింది. భక్తులచే సరస్వతి పుస్తక పూజ కన్నుల పండువగా కొనసాగింది. వరంగల్ భద్రకాళీ కల్యాణోత్సవం, డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. చివరగా సింహ వాహనం, పల్లకీ సేవతో ముగిసింది.
READ MORE: Pawan Kalyan: ఫ్రాన్స్ గౌరవ పురస్కారం పొందిన తోట తరణికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం..!
