Koti Deepotsavam 2024 6th Day Highlights: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది..
* గోవింద్ లక్ష్మీపద్మావతి సప్తస్వరాలు బృందం వారి వీణానాదంతో హరిహరులకు స్వరార్చన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది..
* శ్రీ విద్యారణ్య వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనం అందరినీ మంత్రముగ్ధులను చేసింది..
* ప్రముఖ గాయకులు జగన్నాథం, ప్రముఖ నేపథ్య గాయని శారద సాయిల భక్తి గీతాలు ఆలపిస్తుండగా.. వారితో గొంతు కలిపారు భక్తులు..
* శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారి ప్రవచనామృతంలో మునిగితేలారు..
* ముక్తి ప్రదాయకుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుని అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు..
* శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపంలో మనిషి అలంకరణ ఆకట్టుకుంది..
* వైకుంఠచతుర్ధశి శుభసందర్భంగా ఇల కైలాసంలో ఆపదమొక్కులవాడికి మహాభిషేకం నిర్వహించారు..
* ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణంలో “గణపతి పూజ.. విశ్వక్సేన ఆరాధన”
* ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణంలో “పుణ్యాహవచనం”
* సకల బాధలు తొలగించే ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణంలో విశేష ఘట్టం “రక్షాకంకణ ధారణ”
* ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణంలో విశేష ఘట్టం “యజ్ఞోపవీత ధారణ”
* సర్వారిష్టాలను నివారించే ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం కన్నుల పండుగా సాగింది..
* భక్తుల చెంతకే గరుడ వాహనంపై విచ్చేసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి
* కార్తికమాసంలో మహిమాన్విత ఘట్టం.. బంగారు లింగోద్భవం..
* పరమ శివునికి “సప్త హారతులతో” నీరాజనం.. ఇలా ఆద్యంతం అత్యంత వైభవంగా సాగాయి..
* తిరుపతి శ్రీలలితా పీఠం పీఠాధిపతి శ్రీస్వస్వరూపానందగిరిస్వామి.. బర్దీపూర్ మఠం పీఠాధిపతి శ్రీఅవధూతగిరి మహారాజ్ కోటిదీపోత్సవంలో పాల్గొన్నారు..
* కోటిదీపోత్సవం-2024 6వ రోజు ఉత్సవంలో భాగంగా వేదికపై శ్రీవేంకటేశ్వరస్వామికి మహాభిషేకం + అష్టదళపాదపద్మారాధన నిర్వహించారు..
* ఈ రోజు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని భక్తి టీవీ కోటిదీపోత్సవం ప్రాముఖ్యతను వివరించారు..