NTV Telugu Site icon

koti deepotsavam 2022 First Day: వైభవంగా ప్రారంభమైన కోటిదీపోత్సవం..

Koti Deepotsavam

Koti Deepotsavam

కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంవైపే వెళ్తుంది.. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం.. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది… కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.. ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.. ఇక, బ్రహ్మశ్రీ డా|| బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ప్రవచనామృతం గావించారు.. ఉత్సవంలో భాగంగా కాశీస్పటికలింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చన వైభవంగా సాగింది… శ్రీ భ్రమరి వేదశంకర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులచే వేదపఠనం జరిగింది.. ఇక, మొదటి రోజు కోటిదీపాల ఉత్సవంలో భాగంగా కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది… పరమ శివునికి మహా కుంభాభిషేకం నిర్వహించారు.

Read Also: Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర కల్యాణం

మహాగణపతి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసిన దృశ్యం అద్భుతంగా నిలిచింది.. మొదటి రోజు హంస వాహనంపై కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఊరేగింపు కన్నులపండుగగా సాగింది.. ఉత్సవంలో భాగంగా శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహభాషణం నిర్వహించారు.. కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణంలో పరమ పవిత్రమైన కంకణ ధారణ – రక్షా బంధనం, కల్యాణంలో యోగాన్ని కలిగించే యజ్ఞోపవీత ధారణ, ముక్తేశ్వర స్వామి కల్యాణంలో జీలకర్ర బెల్లం శుభముహూర్త ఘట్టం, మాంగల్య బలాన్ని ఇచ్చే మంగళసూత్ర ధారణ ఘట్టం వైభవంగా సాగాయి.. మొదటి రోజు ఉత్సవంలో భాగంగా కార్తికదీపారాధన, సకల పాపాలు తొలగించే మహా శివలింగానికి ప్రదోషకాల అభిషేకం, సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, సప్త హారతి వైభవంగా సాగాయి..

Show comments