Site icon NTV Telugu

Koti Deepotsavam 2022: మూడో రోజు వైభవంగా కోటి దీపోత్సవం..

Koti Deepotsavam

Koti Deepotsavam

కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరూ ఎన్టీవీ-భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహించి కోటిదీపోత్సవం గురించి చూస్తుంటారు.. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కన్నుల పండువగా కోటి దీపాల ఉత్సవం సాగుతోంది.. ఈ కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు… శివనామస్మరణతో ఎన్టీఆర్‌ స్టేడియం, పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇవాళ కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’ నిర్వహించారు.. డాక్టర్‌ ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.. కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన జరగగా.. ఇష్టకామ్యాలను ప్రసాదించే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. మూషిక వాహన సేవ.. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం వైభవంగా సాగింది.

Read Also: Koti Deepotsavam LIVE: మూడోరోజు కోటి దీపోత్సవం.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం

ఇక, శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం.. శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం నిర్వహించారు.. ఆ తర్వాత ఇలకైలాసంలో భక్తులచే సామూహిక కార్తీక దీపారాధన జరిగింది.. కార్తిక మాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు.. ఓం నమఃశివాయా అంటూ.. పరిసర ప్రాంతాలను మార్మోగించారు.. విశేషమైన భక్తుల మధ్య.. అన్ని కార్యక్రమాలు ఆద్యంతం కోటిదీపోత్సవం మూడో రోజు కూడా కన్నుల పండుగగా సాగింది.. అక్టోబర్‌ 31వ తేదీన ప్రారంభమైన ఈ కోటి దీపాల ఉత్సవం.. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే కాగా.. ఈ ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను ఆహ్వానిస్తోంది ఎన్టీవీ-భక్తి టీవీ.

Exit mobile version