NTV Telugu Site icon

Janmashtami 2024 special: భూలోక బృందావనం.. హైదరాబాద్‌లోని ఈ ఇస్కాన్‌ టెంపుల్ ప్రత్యేకతలు ఇవే..

Iskcon Temple Abids

Iskcon Temple Abids

Janmashtami 2024 special: నిరంతరం హరే కృష్ణ నామం గొప్పతనాన్ని ప్రపంచానికి ఓ మహా వైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్‌.. అసలు ఇస్కాన్‌ అంటే హరే కృష్ణ ఉద్యమం అని పిలవబడే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్.. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం.. కృష్ణుని మార్గాన్ని అనుసరిస్తే.. మానవ జీవన విధానంలో వచ్చే మార్పుల గురించి.. కృష్ణ తత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా 1966 నుంచి బోధిస్తున్న ఓ గొప్ప సంస్థ.

Read Also: KTR: నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. తీవ్ర ఉత్కంఠ..!

ఇక, హైదరాబాద్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌ విషయానికి వస్తే.. అబిడ్స్‌లోని ఇస్కాన్‌ ఆలయంలో 1976లో స్థాపించబడింది.. ఇస్కాన్‌ వ్యవస్థాపకులు శ్రీ ప్రభుపాదులచే భారతదేశంలో నాలుగు ఇస్కాన్‌ ఆలయాలు స్థాపించబడ్డాయి.. మొదటిది 1975లో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో స్థాపించబడింది.. రెండవది హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో.. మూడోవది ముంబైలోని జూహు ప్రాంతంలో.. నాల్గో ఆలయం పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌లో ఉంది.. అయితే, అబిడ్స్‌లో భూలోక బృందావనంగా పిలవబడుతోన్న ఇస్కాన్‌ ఆలయం గురించి.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తుంది.. మీ భక్తి టీడీ.. పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments