NTV Telugu Site icon

Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..

Karthika Masam 2024

Karthika Masam 2024

Karthika Masam: హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు భక్తి, శ్రద్ధలతో శివున్ని ఆరాధిస్తుంటారు. ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా భావించి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకిందనే భోజనాలు చేయాలనే సంప్రదాయం ఎందుకొచ్చిందో తెలుసా..?

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం చెబుతుంది. ఉసిరి చెట్టును భూమాతగా కూడా కొలుస్తారు. దేవుళ్ల కాలంలో దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్దాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షమని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు అని ఆచారాలు చెబుతాయి. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన, దాని నీడలో భోజనాలు చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట.

Read also: Dua Padukone Singh: కూతురికి నామకరణం చేసిన రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు.. పేరేంటంటే?

తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలు అంటూ మొత్తం ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి.. చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తరవాత చెట్టునీడలో భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తీకమాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. అలా చేయడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా.. నరదిష్టి కూడా ఆ ఇంటికి తగలదని చెబుతుంటారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?