NTV Telugu Site icon

Balkampet Yellamma: ఈనెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. నేటికీ ప్రకటించని జాబితా..

Balkam Temple

Balkam Temple

Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపై దృష్టి సారించడంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే.. అమ్మవారికి కల్యాణానికి 15 రోజుల ముందే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాల్సి ఉండగా ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆలయ అధికారులు ప్రచారం లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎల్లమ్మ కల్యాణానికి ఉత్సవ కమిటీ ప్రారంభం కావాల్సి ఉండగా నేటికీ ప్రారంభం కాలేదు. కాగా.. ఈసారి 15 మంది మాత్రమే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయగా వారి జాబితాను నేటికీ ప్రకటించలేదు. దీంతో గందరగోళం నెలకొంది.

Read also: Zebra Satyadev First Look : జీబ్రా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

ఈ కమిటీని ప్రకటించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం పన్నుల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణానికి వచ్చే దంపతులకు టిక్కెట్టు ధర రూ.2,500గా నిర్ణయించి విక్రయించేవారు. ఈసారి ఎన్ని టిక్కెట్లు ఖరారయ్యాయి. ఎంత మంది భక్తులకు అమ్ముడు పోయిందన్న దానిపై స్పష్టత లేదు. స్థానికులు వెళ్లి కల్యాణ టిక్కెట్లు అడిగితే పూర్తిగా అమ్మేశారన్నారు. దీంతో సూపరింటెండెంట్‌తో ఈఓ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై దృష్టి సారించి ఉత్సవ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని పలువురు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Amrapali Kata: రహదారులపై తనిఖీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆన్‌ డ్యూటీ..

Show comments