Site icon NTV Telugu

Ganesh Chaturthi 2025: అలర్ట్.. గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా..? ఇవి చెక్‌ చేసుకోండి…

Ganesha

Ganesha

Ganesh Chaturthi 2025: రాష్ట్రవ్యాప్తంగా ఊరూ-వాడ వినాయక చవితి సందడి నెలకొంటోంది. బొజ్జగణపయ్య ప్రతిష్ఠాపనకు పెద్దసంఖ్యలో మండపాలు కొలువుదీరుతున్నాయి. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చిన్నారులలో వినాయక చవితి వేడుకలు పట్టలేనంతా ఉత్తేజాన్ని నింపుతాయి. ఇటు మండప నిర్వాహకులు.. అటు పోలీసు, మున్సిపాలిటీ, జల మండలి, విద్యుత్‌ విభాగాల అధికారులంతా చవితికి పక్షం రోజుల ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో మునిగిపోతారు.. అయితే మనం ఇప్పుడు మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

READ MORE: Ducati DesertX Rally: డుకాటి డెజర్ట్‌ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ. 1.5 లక్షల బెనిఫిట్స్..

మండపాలకు కర్రలు, ఇనుప పైప్‌లు, రేకులను నాణ్యమైన వాటిని వినియోగించి పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గాలి, దుమారం వచ్చినప్పుడు మండపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణనాథుడి వద్ద దీపాలు వెలిగిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి దగ్గరలో అగ్నికి అంటుకునే స్వభావం కలిగిన వ్రస్తాలు, పూలదండలు, అలంకరణ సామగ్రి, పెట్రోల్, కిరోసిన్‌ లాంటి వాటిని ఉంచరాదు. దీంతో పాటు విద్యుత్‌ తీగల ముందు మండపాలను ఏర్పాటు చేయరాదు. నిమజ్జనానికి తరలించే సమయంలో గణనాథుడిని వాహనంలోకి ఎక్కేంచే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉంటుంది. అందుకే అన్ని జాగ్రత్తలు పాటించాలి.

READ MORE: Kim Jong Un: ఫస్ట్‌ టైమ్ ఏడ్చిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. మోకాళ్లపై కూర్చొని..(వీడియో)

మండపాల వద్ద పటిష్ట భద్రత…
మండపాల నిర్వాహకులు ఎక్కువ మంది అధికారికంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోకుండా స్తంభాలకు వైర్లను వేలాడదీస్తుంటారు. విద్యుత్‌ ప్రమాదాలు జరిగేందుకు ఇక్కడే బీజం పడుతుంది. వదులుగా ఉన్న వైర్లు గాలి, వానకు కింద పడి విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలా కాకుండా అధికారిక కనెక్షన్‌ తీసుకోవడం ద్వారా విద్యుత్‌ అధికారులు అక్కడికి వచ్చి స్తంభం నుంచి కనెక్షన్‌ను ఇస్తారు. ఏదైనా విద్యుత్‌ సమస్య తలెత్తినా వెంటనే వారు స్పందిస్తారు. గతంలో చాలా మంది విద్యుదాఘాతానికి గురై మరణించారు. వినాయక చవితి ఉత్సవాలలో నిర్వాహకులు భక్తిరసమైన పాటలను మాత్రమే పెట్టాలి. అలాకాకుండా సినిమా పాటలు పెట్టి పవిత్రతను దెబ్బతీయరాదు. దీంతో పాటు ఉత్సవాలు కొనసాగినన్నీ రోజులు నిర్వాహకులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి పూజాది కార్యక్రమాలు చేయాలని భాగ్యనగర గణేష్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు సూచిస్తున్నారు. అలాగే.. విద్యుత్‌ లైన్స్‌ ఎక్కడైనా తెగి పడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే 1912/100 నంబర్లకు లేదా సమీప ప్యూజ్‌ ఆఫ్‌ కాల్‌కు కాల్‌ చేసి విద్యుత్‌ సిబ్బంది తెలియజేయాలి.

READ MORE: Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?

పోలీసుల అనుమతి…
పోలీస్‌ శాఖకు చెందిన https:///policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌ తెరవగానే.. గణేష్‌ మండపాల అనుమతి, శోభాయాత్రకు సంబంధించిన ప్రత్యేక పేజీ కనిపిస్తుంది. అందులో దరఖాస్తుదారుడి పేరు, చరవాణి సంఖ్య, చిరునామా, యువజన సంఘం పేరు తదితర వివరాలు నమోదు చేయాలి. అనంతరం మండపం ఏర్పాటుచేస్తున్న ప్రాంతం, మట్టి వినాయకుడా? పీవోపీతో చేసిన గణేషుడా? వినాయకుడి, మండపం ఎత్తు, మండపం ఏర్పాటు, నిమజ్జనం తేదీలను నమోదు చేయాలి. శోభాయాత్ర సాగే సమయం, మార్గం వివరాలు, నిర్వాహకులకు చెందిన ఐదుగురు బాధ్యుల పేర్లు, వారి చరవాణి నంబర్లు, నవరాత్రులు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమాలు, డీజే వివరాలను పేర్కొనాలి. ఈ వివరాలన్నీ నమోదుచేసి సబ్‌మిట్‌ చేయాలి. వచ్చిన దరఖాస్తు నంబరు వివరాల ప్రతిని ప్రింట్‌ తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలి.

READ MORE: KTR : ఓపెన్ ఏఐ హైదరాబాద్‌లో ఆఫీస్ పెడుతుందా..? కేటీఆర్‌ ఇచ్చిన ఆహ్వానం

Exit mobile version