Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Chaturthi 2026: వినాయక చవితి వచ్చేసింది.. గల్లీ నుంచి ఢిల్లీ దాక అనే విధంగా.. ప్రతి గల్లీ, ఊరు, వాడ, పల్లెటూరు, పట్నం అనే తేడా లేకుండా.. గణపతి మంఠపాలు సిద్ధం అవుతున్నాయి.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. ఏర్పాట్లలో మునిగి పోయారు భక్తులు.. మరోవైపు.. చిరు వ్యాపారులు వర్షాల్లోనే ఇబ్బందులు ఎదురైనా విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయిస్తున్నారు.. అయితే, చాలా మంది ఇంట్లోనే గణపతిని ప్రతిష్టిస్తుంటారు.. గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గణపతి బప్పా విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. భాద్రపద శుక్లపక్ష చవితి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు సాధారణంగా పది రోజుల పాటు కొనసాగుతాయి. ఇంట్లో గణపతి ప్రతిష్ఠిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శుభం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే గణపతి స్థాపనకు ముందు కొన్ని నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక విశ్వాసాలు సూచిస్తున్నాయి.
ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి
ఇంట్లో గణపతి ప్రతిష్ఠకు ముందు ఆ ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. బప్పా విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని శుభ్రపరిచి గంగాజలాన్ని చల్లడం ద్వారా పవిత్రం చేయాలని సూచిస్తారు. పూజకు అవసరమైన సామగ్రిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి.. పూలు, పండ్లు, ఆకులు గణపయ్యకు ఎంతో ఇష్టం..
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
ఈశాన్య దిశలో గణపతిని ప్రతిష్ఠించాలి
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గణపతి విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో, అంటే ఈశాన కోణంలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. పూజ చేసేటప్పుడు భక్తుల ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచిదని చెబుతారు.
విగ్రహం విషయంలో జాగ్రత్తలు
గణపయ్య విగ్రహం తీసుకొచ్చే సమయంలో.. ఆ విగ్రహానికి ఎలాంటి విరుగుడు లేదా లోపాలు లేకుండా సంపూర్ణంగా ఉండాలి. గణపతి తన వాహనమైన ఎలుకపై కూర్చుని, ఒక చేతిలో మోదకం, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలోని విగ్రహాన్ని ఎంచుకోవాలని సూచిస్తారు.
సాత్విక వాతావరణం ఉండాలి
ఇక, వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించి.. నిమజ్జనం చేసేవరకు అంటే గణపతి ఇంట్లో ఉన్నన్ని రోజులు సాత్విక వాతావరణాన్ని కొనసాగించాలి. కుటుంబ సభ్యులు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి, తామసిక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి.
ఇంటిని ఖాళీగా వదిలిపెట్టకూడదు
ఇంట్లో గణపతిని ఒకటిన్నర రోజు, మూడు, ఐదు లేదా పది రోజుల పాటు ప్రతిష్ఠించినా ఆ సమయంలో ఇంటిని పూర్తిగా ఖాళీగా ఉంచడం లేదా తాళం వేసి వెళ్లడం మంచిది కాదని చెబుతారు. బప్పా ఇంట్లో ఉన్నంతకాలం ఇంట్లో సాత్విక వాతావరణాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు..
రోజూ పూజ చేసి మూడుసార్లు నైవేద్యం
ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. రోజుకు కనీసం మూడుసార్లు బప్పాకు భోగం సమర్పించాలని సూచిస్తారు. గణపతికి మోదకం అత్యంత ప్రీతికరమైన నైవేద్యంగా భావిస్తారు. అందుకే పూజలో మోదకాలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
గణపతికి తులసి సమర్పించకూడదు
మరో కీలకమైన విషయం ఏంటంటే.. పత్రిని ఎంతగానే ఇష్టపడే గణపతికి.. పూజలో తులసి ఆకులను సమర్పించడం నిషిద్ధమని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. అందువల్ల తులసికి బదులుగా దుర్వ, శమి ఆకులు, ఎర్రటి పువ్వులు, మోదకాలను సమర్పించాలని సూచిస్తారు.
నేలపై నేరుగా విగ్రహం పెట్టకూడదు
భక్తులు ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకోవడంలో ఇంకో నియమాన్ని కూడా పాటించాలి.. విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచకూడదు. ముందుగా చెక్క పీటను ఏర్పాటు చేసి దానిపై పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. అనంతరం ఆ పీటపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
ఎడమవైపు తొండం ఉన్న గణపతిని ఎంచుకోవాలి
ఇంట్లో ప్రతిష్ఠించడానికి తొండం ఎడమవైపు తిరిగి ఉన్న గణపతి విగ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఎడమవైపు తొండం ఉన్న రూపాన్ని ‘వక్రతుండ’ రూపంగా పేర్కొంటారు. కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని గృహస్థులు ప్రతిష్ఠించకపోవడం మంచిదని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. అలాంటి విగ్రహాల పూజకు మరింత కఠినమైన నియమాలు ఉంటాయని నమ్మకం.
మట్టి విగ్రహానికే ప్రాధాన్యం
పర్యావరణ పరిరక్షణపై కూడా కొంత శ్రద్ధ పెట్టాలి.. గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేసినదాన్ని ఎంచుకోవడం మంచిదని సూచిస్తారు. ప్లాస్టిక్ లేదా ఇతర కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించకూడదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి. సహజమైన మట్టి విగ్రహానికి ప్రాధాన్యం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు.
విగ్రహం రంగు కూడా ముఖ్యమే
ఇంట్లో పెట్టుకునే గణపతి విగ్రహం రంగును ఎంచుకునే విషయంలోనూ భక్తులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. సింధూరి, తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న గణపతి విగ్రహాలను శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి ఇంటి పూజ కోసం ఈ రంగుల్లో ఏదైనా ఒక రంగు విగ్రహాన్ని ఎంచుకోవచ్చని ఆధ్యాత్మిక విశ్వాసాలు సూచిస్తాయని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!