Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!

Astrology Today

Astrology Today

తుల రాశి వారికి ఆదాయ మార్గాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు ఖరారవుతాయి. ఉద్యోగ వ్యవహారాలలో అధికారుల సహకారాన్ని కోరుకుంటారు. వీరు శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. పెద్దలు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అజాగ్రత్త పనికిరాదు. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది, కష్టపడి చదవాలి. వీరు మహాసరస్వతీ అమ్మవారి సరస్వతీ కవచాన్ని పారాయణం చేయాలి.

కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. క్రీడలు, సాంకేతిక రంగాలలో మంచి అనుకూలతలు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. వీరు శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ నారాయణ అష్టకాన్ని పారాయణం చేయడం శ్రేయస్కరం. కుంభ రాశి వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలతలు పెరిగి సమాజంలో గౌరవం పొందుతారు. వీరు శ్రీ వేణుగోపాల స్వామి వారిని తులసి దళాలతో పూజించడం శ్రేయస్కరం. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.