Friday Astrology Today October 30 2026: జీవితంలో ప్రతీరోజూ కొత్త ఆశలతో, భిన్నమైన అనుభవాలతో ముందుకు సాగుతుంది. రాబోయే కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దైవారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (2026 అక్టోబర్ 30) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు.
ఈ రోజు మేష రాశి వారు ఉద్యోగ సమాచారాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పోటీ తత్వాలు పెరిగినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి స్కందషష్టి కవచం పారాయణం చేయడం మంచిది. వృషభ రాశి వారు వ్యాపార కార్యక్రమాలలో సంతృప్తికరమైన లాభాలు పొందుతారు. భూసంబంధిత అంశాలలో పెట్టుబడులు కలిసి వస్తాయి. కుటుంబ కార్యక్రమాలతో పాటు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి తులసి అర్చన చేసి స్తోత్రం పారాయణం చేయాలి.
కుంభ రాశి వారు నూతన సాంకేతిక విద్యల విషయంలో మంచి అనుకూలతలు పొందుతారు. సాంఘిక జన సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. భవిష్యత్తు పెట్టుబడులు కలిసి వస్తాయి. శ్రీమన్నారాయణుని నారాయణ కవచం పారాయణం చేయాలి. సింహ రాశి వారు పలు బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ ప్రతిభతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. రాజకీయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ రుద్రేశ్వర స్వామి వారికి శివార్చన చేసి పెరుగన్నం నివేదించాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

