Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Friday Astrology

Friday Astrology

Friday Astrology October 20 2026: జీవితంలో ప్రతీరోజూ కొత్త సవాళ్లతో పాటు అనేక అవకాశాలను కూడా మోసుకొస్తుంది. ఏ రోజు ఏ పని చేపడితే మంచి ఫలితాలు వస్తాయి, ఏ దైవాన్ని ఆరాధిస్తే అదృష్టం వరిస్తుంది అనే విషయాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (2026 అక్టోబర్ 23) నాటి దినఫలాలు అందించారు. ద్వాదశ రాశుల వారి జాతక విశేషాలు, పాటించాల్సిన పరిహారాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.

మిథున రాశి వారికి అన్ని రంగాలలో అనుకూలతలు కలిసి వస్తాయి. ముందుచూపుతో తీసుకోబోయే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. విందు, విలాసాలలో పాల్గొంటారు. విదేశీ ప్రయాణాల గురించి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రం పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారికి కార్యసిద్ధి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మొండి బాకీలు వసూలవుతాయి. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువును తులసీ దలాలతో అర్చించాలి.

మకర రాశి వారికి ఉన్నతమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. విమర్శలకు దూరంగా ఉండాలి. రాజకీయ కార్యక్రమాలలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించడం మంచిది. కుంభ రాశి వారు తమ కృషికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. రుణబాధలు, సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రశాంతంగా వ్యవహరించాలి. సూర్యనారాయణ స్వామివారి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి.