Friday Horoscope November 27 2026: కన్యా రాశి వారికి వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సంతోషాలు మేలు చేస్తాయి. పెద్ద వారితో కీలక విషయాలు చర్చిస్తూ విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి సత్యాష్టకం పారాయణం చేయడం మంచిది. తులా రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా రావలసిన ప్రయోజనాలు అందుతాయి. దూరప్రాంత ప్రయాణాలు ఉపయోగపడి రావలసిన బాకీలు వసూలవుతాయి. లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం పారాయణం చేయాలి.
ధనుస్సు రాశి వారికి నేడు అనుకూలతలు ఉంటాయి. క్రయవిక్రయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రావలసిన బాకీలు వసూలవడంతో పాటు వాహన కొనుగోలు వ్యవహారాలు కలిసి వస్తాయి. శివాలయంలో పరమేశ్వరునికి అర్చన నిర్వహించాలి. కుంభ రాశి వారికి అనుకూలతలు ఉండి రాజకీయ కార్యక్రమాలు మేలు చేస్తాయి. ఉద్యోగ అభివృద్ధి, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దానధర్మాలు చేయగలుగుతారు. లలితా అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (2026 నవంబర్ 27) నాటి రాశి ఫలాలు భక్తి టీవీ వేదికగా అందించారు.

