Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

  • శుక్రవారం దిన ఫలాలు
  • మేష రాశి వారికి సానుకూలం
  • స్నేహితులతో సంతోషంగా గడుపుతారు
Friday Horoscope

Friday Horoscope

Friday Astrology June 12 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (12 జూన్ 2026) దినఫలాలను అందించారు. మేష రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, సరైన ఫలితాలు లభిస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన వివాదాలు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. సూర్యనారాయణ స్వామి. మీరు చేయవలసిన పూజ.. స్వామివారిని మందార పూలతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

కుంభ రాశి వారు ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నూతన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తుల అడుగుజాడలను పరిశీలించి వాటిని పాటిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలను తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. నేడు మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.

×
×
Ad