Bhakthi: హిందు పురాణాల ప్రకారం ఏదైనా పనిని ప్రారంభించే ముందు తొలి పూజ వినాయకునికి చెయ్యాలని సూచిస్తారు మన పెద్దలు. ఇదే ఇప్పటికి ఆనవాయితీగా వస్తుంది. విగ్నేశ్వరుడు భోజన ప్రియుడు. అందుకే విగ్నేశ్వరుడికి పూజ చేసే సమయంలో కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం మొదలైన పదార్ధాల్ని నైవేద్యంగా పెడతాము. అలానే గణపతిని రకరకాల ఆకులతో పువ్వులతో పూజిస్తాం. కానీ తులసి ఆకులతో మాత్రం పూజించకూడదు అని పండితులు చెప్తుంటారు. అన్ని ఆకులతో చివరికి గరికతో పూజించిన సంతోషించే స్వామిని తులసి ఆకులతో ఎందుకు పూజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
ఒకసారి విఘ్నేశ్వరుడు గంగానది తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ధర్మాత్ముడి కూతురు అయినటువంటి తులసి అనే యువతీ వివాహం చేసుకోవడానికి మంచి వరుడిని వెతుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరింది. అలా ఆ యువతి తీర్ధయాత్రలు చేస్తూ గంగానది తీరానికి చేరింది. అక్కడ తపస్సు చేసుకుంటున్న వినాయకుణ్ణి చూసింది. రత్నాల సింహాసనంపై కూర్చుని తపస్సులో నిమగ్నమై ఉన్న వినాయకుని శరీర భాగాలన్నీ చందనం పూయబడి కాంతివంతంగా మెరిసిపోతున్నాడు. ఆయన మెడలో పారిజాత పుష్పాలతో బంగారం, రత్నాల హారాలతో పాటుగా సువాసన వెదజల్లే పరమిళభరిత గంధపు హారాన్ని ధరించాడు. ఆ ముగ్ధ మనోహర సుందర రూపాన్ని దర్శించిన తులసి ఆయన అందానికి ముగ్ధురాలై వినాయకుని దగ్గరకి వెళ్ళింది. తపస్సులో ఉన్న వినాయకునితో తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది.
Read also:Ganesh chathurthi: ఈ మంత్రం చెప్తూ గణేష్ నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం
అయితే తులసి వల్ల వినాయకునికి తపోభంగం జరిగింది. దీనితో వినాయకుడు తులసితో నేను ఆజన్మ బ్రహ్మచారిని.. నీ వల్ల నా తపస్సు భంగమైనది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్తాడు. వినాయకుని మాటలు విన్న తులసికి ఆగ్రహం వస్తుంది. పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించిన నీకు రెండు పెళ్లిళ్లు అవుతాయని వినాయకుణ్ణి శపిస్తుంది. వినాయకుడు కూడా నువ్వు ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుంటావు అని తులసిని శపిస్తాడు. దీనితో భయపడిన తులసి వినాయకుణ్ణి తప్పైనది అంటూ శరణు కోరుకుంటుంది. అప్పుడు వినాయకుడు నువ్వు శంఖార్చున్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటావు , ఆతరువాత నువ్వు మొక్కగా మారిపోతావు. కలియుగంలో నీకు మోక్షం లభిస్తుంది. కానీ నా పూజలో మాత్రం నీవు ఉపయోగపడవు అనే షరతు విధిస్తాడు. అందుకే వినాయకునికి తులసి ఆకులతో పూజ చెయ్యరు.