Koti Deepotsavam 2022: 9వ రోజు కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2022: అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైప భక్తి టీవీ కోటి దీపోత్సవం 9వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగనుంది. మంగళవారం నాడు కోటి దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈరోజు తొలుత డా.శంకరమంచి రామకృష్ణశాస్త్రి స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ చేశారు. చిట్యాలకు చెందిన శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల విద్యార్థులు వేదపఠనం చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం చేశారు, శ్రీ పరిపూర్ణానందగరి స్వామిజీ వారు (ఏర్పేడు, వ్యాసాశ్రమం), శ్రీ అసంగానందగిరి స్వామీజీ (ఏర్పేడు, ఉత్తరాధిపతి వ్యాసాశ్రమం), శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ (హైదరాబాద్, జగన్నాథమఠం) అనుగ్రహ భాషణం చేశారు.

Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వారికి గురు వందనం, శ్రీ అసంగానందగిరి స్వామీజీ వారికి గురు వందనం, శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ వారికి గురు వందనం జరిగాయి. పూణే డోల్ వాయిద్యం, పంబమేళా, సాంస్కృతిక కదంబం వంటి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చంద్రగ్రహణం ముగియడంతో శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. తర్వాత అశ్వవాహన సేవ, సింహ వాహన సేవలను వైభవంగా నిర్వహించారు. గంగానది నుంచి తెచ్చిన దివ్యజలంతో సంప్రోక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఓం నమః శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. వాహన సేవల్లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. ఇల కైలాసంగా విలసిల్లింది.

తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!