NTV Telugu Site icon

Dasara Puja 2024: దసరా శుభ సమయం.. పూజా విధానం.. మంత్రం..

Dasara Puja 2024

Dasara Puja 2024

Dasara Puja 2024: దసరా రాక్షసుల సంహారానికి ప్రతీక. చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశాన్ని అందించే పండుగ విజయదశమి. విజయ దశమి విశిష్టతను వివరించే అనేక పురాణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మహిషాసుర సంహారం. మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకప్పుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేసి ఏ మనిషి చేతిలోనూ మరణించని వరం పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ వరం వల్లనే దేవతలను, మానవులను వేధిస్తున్న మహిషాసురుడుని జగన్మాత తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చంపేసింది. అందుకు ప్రతీకగా దేవీ శరన్నవరాత్రిని నిర్వహించి పదిరోజుల పాటు విజయదశమి జరుపుకుంటారు. అయితే ఈరోజు పూజకు కావలసిన సామాగ్రి, పూజా విధానం, పఠించాల్సిన మంత్రం తెలుసుకుందాం..

Read also: Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్.. దర్శన సమయాల్లో మార్పులు..!

దసరా ఒక శుభ సమయం

దృక్ పంచాంగ్ ఆశ్వయుజ మాసం ప్రకారం శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13, 2024న ఉదయం 09:08 గంటలకు ముగుస్తుంది. ఈసారి దసరా రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం కూడా ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధి యోగం ఇవాళ ఉదయం 06:20 నుండి రేపు అనగా (అక్టోబర్ 13వ) తేదీ ఉదయం 04:27 వరకు ఉంటుంది. రవియోగం రోజంతా ఉంటుంది.

దసరా పూజా విధానం

దసరా పూజ ఇంటి తూర్పు దిశలో లేదా ఈశాన్య మూలలో నిర్వహిస్తారు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉదయాన్నే భగవతీ దేవిని పూజించండి. ఈశాన్య మూలలో గంధం, కుంకుమతో అష్టభుజి కమలాన్ని తయారు చేయండి తర్వాత అపరాజిత దేవితో పాటు జయ, విజయ సమేతంగా పూజించండం వలన మంచి కలుగుతుంది. ముక్కోటి దేవతలను షోడశ ఉపచారాలతో పూజించి వారి హారతి చేయండి. విధిగా శమీ వృక్షాన్ని పూజించండి. దీనితో పాటు రాముడు, హనుమంతుడిని పూజించండి.పూజ పూర్తయిన తర్వాత, దుర్గాదేవికి నమస్కరించి, నైవేద్యాలు సమర్పించండి. తర్వాత అందరికీ ప్రసాదం పంచండి. దసరా రోజున పిట్టను చూడటం శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు ఇంటి గుమ్మం దగ్గర నాలుగు ముఖాల దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం.

మంత్రం..
దసరా రోజున పూజా సమయంలో మీరు ‘శ్రీ రామచంద్రాయ నమః’ లేదా ‘రామే నమః’ అనే మంత్రాన్ని జపించవచ్చు.
Devaragattu Bunny Festival: నేడు దేవరగట్టు కర్రల సమరం.. ఏంటి ప్రత్యేకత..?

Show comments