Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!

  • గురువారం దిన ఫలాలు
  • ఆ మూడు రాశుల వారికి పండగే
  • వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి
  • ఆదాయ మార్గాలు పెరుగుతాయి
Today Astrology

Today Astrology

Thursday Horoscope: ఈ రోజు మేష రాశి వారికి వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు ఎంతో అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజకీయ పరమైన కార్యక్రమాల్లో వేర్వేరు రూపాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయ స్వామి వారి పంచకమును పారాయణ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ రోజు వివిధ రూపాల్లో ఆర్థిక అవసరాలు కలుగుతాయి. వ్యాపారపరమైన అంశాల్లో కష్టానికి తగిన ప్రతిఫలాలు అందుతాయి. అధికారిక పరమైన సమావేశాలు, వేర్వేరు రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. కామాక్షి స్తోత్రమును పారాయణం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

సింహ రాశి వారికి ఈ రోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల్లో అరుదైన అనుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యాపార లాభాలు కలిసి రావడంతో పాటు ఉద్యోగ కార్యక్రమాల్లో కొత్త ఉపాధి అవకాశాలను పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏకశ్లోకి భాగవతాన్ని పారాయణం చేయడం మంచిది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు జూన్ 11 నాటి ద్వాదశ రాశుల దినఫలాలను అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

×
×
Ad