Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!

  • బుధవారం దిన ఫలాలు
  • ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు
  • చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది
Today Astrology

Today Astrology

Daily Horoscope June 10 2026: ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ ద్వారా 10 జూన్ 2026 నాటి దినఫలాల అందించారు. తులా రాశి వారు చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సమాజంలో అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తారు. నాయకులతో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. అష్టలక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. మహాలక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభప్రదం.

కుంభ రాశి వారు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను, పనులను సజావుగా పూర్తి చేస్తారు. ఆప్తులు, హితైషుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నేడు మీకు అనుకూలించే దైవం.. కార్తికేయ స్వామి. ఈరోజు మీరు చేయవలసిన పూజ.. సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఉన్నాయి.

×
×
Ad