Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!

  • ఆదివారం దిన ఫలాలు
  • విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు
  • ఉద్యోగ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు
Sunday Astrology

Sunday Astrology

Today Horoscope July 19 2026: గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులు మన దైనందిన జీవితంలో చేపట్టే పనుల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఆదివారం (జూలై 19) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి దిన ఫలాలు చూద్దాం. కింది వీడియోలో నేటి రాశి ఫలాలు ఉన్నాయి.

కుంభ రాశి వారు నూతన వస్తువులు లేదా వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. స్నేహితులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే వ్యాపార పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల చదువులు, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీరు దుర్గా అమ్మవారిని స్మరిస్తూ దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం మంచిది. మీన రాశి వారికి వ్యక్తిగత, ఉద్యోగ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మకూడదు. మీ వ్యాపారానికి సంబంధించిన కీలక రహస్యాలను ఇతరులకు చెప్పకుండా దాచడం మంచిది. భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వీరు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.