Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!

Astrology Today

Astrology Today

Today Horoscope July 15: నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలోని ఆలోచనలపై, పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో బుధవారం (జూలై 15) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి.. ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో.. ఏ దైవ పూజలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దినఫలాలను భక్తి టీవీలో అందించారు.

మేష రాశి వారికి ఈరోజు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబ పరంగా ఊహించని ప్రయోజనాలు చేకూరి సంతోషాన్ని ఇస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆకస్మిక ఆర్థిక నష్టాలు రాకుండా ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామిని స్మరిస్తూ గురు స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు చెడు స్నేహాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో అనవసర కలహాలు, మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించాలి. వీరు శ్రీ పాండురంగ స్వామిని ఆరాధిస్తూ విఠలేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.