NTV Telugu Site icon

Hyderabad Bonalu: జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..

Hyderabad Bonalu

Hyderabad Bonalu

Hyderabad Bonalu: జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జులై 07 ఆదివారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభమై ఆగస్టు 04 ఆదివారంతో ముగుస్తుంది.. కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో ప్రతి నెలా బోనాలు నిర్వహిస్తారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణ ఏడాది పొడవునా ఉంటుందని భక్తుల విశ్వాసం. జూలై 7న గోల్గొండ జగదాంబ అమ్మవారితో బోనాలు ప్రారంభమై ఆగస్టు 4న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి జాతరతో ముగుస్తుంది. లాల్ దర్వాజ తదితర ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

Read also: FMGE Exam: ఇవాళ ఎఫ్‌ఎం‌జీఈ అర్హత పరీక్ష.. క్వశ్చన్ పేపర్పై కీలక ప్రకటన

బోనం అంటే..

బోనం అంటే భోజనం అని అర్థం. ప్రకృతి ఇచ్చిన దానిని నైవేద్యంగా మార్చి అమ్మవారికి సమర్పించడమే బోనం. అంతా సిద్ధమైన తర్వాత బోనం కుంటను తలపై ఉంచి డప్పుల మోత నడుమ అమ్మవారికి సమర్పిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. ఒక చిన్న మట్టి పాత్రలో నీరు పోసి చక్కెర మరియు బెల్లం కలిపి పానీయం తయారుచేయాలి. బోనాల పండుగ ఊరేగింపులో పోతురాజు, శివసత్తుల విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

Read also: India vs Zimbabwe : జింబాబ్వే గడ్డపై టీమిండియా కుర్రాళ్లు సత్తా చాటుతారా..? మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడంటే..

హైదరాబాద్‌లో బోనాల సందడి

హైదరాబాద్‌లో బోనాల సందడి విషయానికొస్తే, 1869లో జంటనగరాల్లో ప్లేగు మహమ్మారిలా వ్యాపించింది. ప్రజలంతా పిట్టల్లా పడిపోయారు. ఆ సమయంలో అమ్మవారి ఆగ్రహానికి గురయ్యామని భావించిన వారంతా అమ్మవారిని శాంతింపజేసేందుకు ఈ బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోల్కొండను పాలించిన తానీషా హయాంలో హైదరాబాద్‌లో బోనం పండుగ ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఈ బోనాల పండుగను ప్రారంభించినట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే బోనం కుండలో పసుపు వేసి ఆకులు కట్టడమే కాదు. పసుపు నీళ్లు చల్లడం కూడా ఇందులో భాగమే.
India vs Zimbabwe : జింబాబ్వే గడ్డపై టీమిండియా కుర్రాళ్లు సత్తా చాటుతారా..? మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడంటే..

Show comments