విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి నుంచి భవాని మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమయ్యే ఈ దీక్షను భవాని దీక్ష లేదా భవానీ మాల అని కూడా అంటారు. కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది. ఈ దీక్షలో ఉన్న ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు.
Read Also: Chennai: కరూర్ తొక్కిసలాటపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి మండల మాల ధారణలు ప్రారంభమయ్యాయి. దీంతో భవానీ మాత దీక్ష కోసం భక్తలు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. గణపతి పూజ అనంతరం దీక్ష ధరణాలు ప్రారంభించిన స్థానాచరులు,అర్చక స్వాముల పర్యవేక్షణలో భవానీ మాల ధారణలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న మాల ధారణలు జరగునున్నాయని అర్చక స్వాములు వెల్లడించారు. నవంబర్ 5 వ తేదీతో దీక్ష ధారణాలు సమాప్తి అవుతాయిని.. నవంబర్ 21 నుంచి అర్థమండల దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు.
Read Also:LPG: తగ్గిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి…
నవంబర్ 21 నుంచి నవంబర్ 2 వరకు ఐదు రోజులు అర్థ మండల మాల ధారణలు జరగనున్నాయని.. నవంబర్ 25 తో అర్థ మండల దీక్ష ధరణాల సమాప్తి అవుతుందని అర్చక స్వాములు తెలిపారు. డిసెంబర్ 4 వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం ఉంటుందని.. డిసెంబర్ 15 తేదీనా భవాని దీక్ష విరమణలు పూర్తవుతాయని ఆలయ సిబ్బంది వెల్లడించారు. దీక్ష విరమణలు చేసే ఐదు రోజులు పాటు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ వెల్లడించారు.
